terrorist ఉగ్రవాదుల దాడికి నిరసన
ABN , Publish Date - Apr 24 , 2025 | 12:53 AM
జమ్మూ కశ్మీర్‌లో సోమవారం పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు.
ధర్మవరం, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): జమ్మూ కశ్మీర్‌లో సోమవారం పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం రాత్రి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కళాజ్యోతి సర్కిల్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బెస్తశ్రీనివాసులు, అడ్డగిరి శ్యాంకుమార్ పాల్గొన్నారు.