చీరలతో పంటలకు రక్ష
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:05 AM
అడవి పందులు, జింకల బెడద నుంచి పంటలను కాపాడుకోవాడానికి రైతులు నానా పాట్లు పడుతున్నారు.
గుత్తిరూరల్, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): అడవి పందులు, జింకల బెడద నుంచి పంటలను కాపాడుకోవాడానికి రైతులు నానా పాట్లు పడుతున్నారు. పలు గ్రామాల్లో సాగుచేసిన వేరుశనగ పంటకు పిందలు కాయలు ఉన్నాయి. వాటిని రాత్రివేళల్లో పందులు, జింకలు వచ్చి తినేస్తూ.. పంటలను నాశనం చేస్తున్నాయి. వాటి బారి నుంచి పంటలను రక్షించుకోవడానికి కొంతమంది రైతులు పొలాల చుట్టూ కర్రలు ఏర్పాటు చేసి.. వాటికి చీరలు కడుతున్నారు. చీర రూ.20 ప్రకారం 200 నుంచి 300 కొనుగొలు చేసి.. వాటిని పొలాల చుట్టూ ఏర్పాటు చేసుకున్నారు. మరి కొందరు రైతులు మైకులు ఏర్పాటు చేసుకుంటున్నారు.