Share News

హామీలపై అసెంబ్లీలో చర్చించాలి : ఏఐఎ్‌సఎఫ్‌

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:57 PM

ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు డిమాండ్‌ చేశారు.

హామీలపై అసెంబ్లీలో చర్చించాలి : ఏఐఎ్‌సఎఫ్‌
కళ్యాణదుర్గంలో ఆర్డీఓకు వినతి పత్రం ఇస్తున్న నాయకులు

కళ్యాణదుర్గంరూరల్‌, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చించాలని ఏఐఎ్‌సఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం నాయకులతో కలి సి ఆర్డీఓ వసంతబాబుకు వినతిపత్రాన్ని అందజేసిన ఆయ న మాట్లాడారు. రూ. 6400 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని, వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయరాదని, ఉన్నత విద్యకు శాపంగా మారిన జీవో నెంబర్‌ 77ను రద్దు చేయాలని, డిగ్రీ అడ్మిషన్లను పాత విధానంలో కొనసాగించి సకాలంలో నోటిఫికేషన విడుదల చేయాలని కోరారు. అలాగే విద్యార్థి సంఘాల నాయకులు విద్యాసంస్థల్లోకి ప్రవేశించకుండా తీసుకువచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలను ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిష్కరించాలని కోరారు. వీటిపై స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఏఐఎ్‌సఎఫ్‌ నియోజకవర్గ కోశాధికారి పవన, గర్ట్స్‌ కన్వీనర్‌ మౌలిక, ఉపాధ్యక్షులు హర్షవర్దన పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2025 | 11:57 PM