Collector పరిశ్రమల స్థాపనతో ప్రగతి
ABN , Publish Date - May 22 , 2025 | 11:50 PM
జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన పేర్కొన్నా రు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక, ఎగుమతుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
పుట్టపర్తిటౌన, మే 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన పేర్కొన్నా రు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక, ఎగుమతుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని మరింత పట్టిష్టం చేసి, విస్తృత పరిచేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేసి.. జిల్లా ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. నూతనంగా పారిశ్రామిక రంగంలోకి రావాలనుకున్న ఔత్సహిక పారిశ్రామిక వేత్తలకు సహా య సహకారాలు అందించాలన్నారు. అందుకు పరిశ్రమ శాఖాధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లాలో నూతన పరిశ్రమల స్థాపన కోసం చేసుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ఇప్పటివరకు పరిశ్రమలు స్ధాపించినవారికి విద్యుత సబ్సిడీ, వడ్డీరాయితీ నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహమ్మద్ రఫీ, విస్తర్ణ అధికారులు సంజీవరాజు, ఓబులేసు, దుర్గేష్, డీపీఓ సమత, జిల్లా ఉద్యానవన శాఖాధికారి చంద్రశేఖర్, సాంఘిక సంక్షేమాధికారి శివరంగ ప్రసాద్ పాల్గొన్నారు.