గ్రామాల్లో సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:12 PM
గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని పలువురు సర్పంచులు డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.
గుంతకల్లుటౌన, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో సమస్యలను పరిష్కరించాలని పలువురు సర్పంచులు డిమాండ్ చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. నెలగొండ పంచాయతీలో కొత్త పనులు చేయడం లేదని, పాత పనులకు బిల్లులు ఇవ్వలేదని, గ్రామంలో సమస్యలు పరిష్కరించడం లేదని ఆ గ్రామ సర్పంచ పాటిల్ భాగ్యమ్మ నేలపై భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారంలో సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయంలో పాఠశాలల అభివృద్ధిపై జడ్పీటీసీ కదిరప్ప, వైసీపీ ఎంపీటీసీలు వాదోపవాదాలు చేసుకున్నారు. సర్వసభ్య సమావేశానికి చాలా మంది అధికారులు గైర్హాజర్ కావడంపై పలువురు ఎంపీటీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, ఇనచార్జి ఎంపీడీఓ నాగభూషణం, జడ్పీటీసీ కదిరప్ప పాల్గొన్నారు.