Share News

కేజీబీవీలో సమస్య పరిష్కారం

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:49 AM

శ్రీచిక్కణ్ణేశ్వర చెరువు బ్యాక్‌ వాటర్‌ కేజీబీవీ ఆవరణంలోకి ప్రవేశిస్తుండటంతో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడేవారు.

కేజీబీవీలో సమస్య పరిష్కారం
కేజీబీవీ ముందు మట్టి వేయిస్తున్న టీడీపీ నాయకులు

కణేకల్లు, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): శ్రీచిక్కణ్ణేశ్వర చెరువు బ్యాక్‌ వాటర్‌ కేజీబీవీ ఆవరణంలోకి ప్రవేశిస్తుండటంతో విద్యార్థులు, సిబ్బంది ఇబ్బందులు పడేవారు. దీనిపై ఆంధ్రజ్యోతి బుధవారం ఓ కథనాన్ని ప్రచురించింది. స్పందించిన స్థానిక టీడీపీ నాయకులు తమ సొంత డబ్బుతో నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో మట్టి తోలించి సమస్యను పరిష్కరించారు. ఇందులో టీడీపీ నాయకులు లాలెప్ప, ఆనంద్‌రాజ్‌, చంద్రశేఖర్‌గుప్తా, బీటీ రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 12:49 AM