Share News

Private vehicle ప్రైవేట్‌ వాహనాల అడ్డగింత

ABN , Publish Date - Jun 06 , 2025 | 12:05 AM

ఉరవకొండ నుంచి అనంతపురానికి ప్రైవేట్‌ ఆపరేటర్లు అనుమతులు లేకుండా వాహనాలను నడుపుతున్నారని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక షిర్డీ సాయి ఫోర్‌ వీల్‌ మోటార్‌ వెహికల్‌ అసోసియేషన నాయకులు మండిపడ్డారు.

Private vehicle  ప్రైవేట్‌ వాహనాల అడ్డగింత
ఆందోళన నిర్వహిస్తున్న షిర్డీసాయి ఫోర్‌ వీల్‌ మోటార్‌ వెహికల్‌ సంఘం నాయకులు

ఉరవకొండ, జూన 5(ఆంధ్రజ్యోతి): ఉరవకొండ నుంచి అనంతపురానికి ప్రైవేట్‌ ఆపరేటర్లు అనుమతులు లేకుండా వాహనాలను నడుపుతున్నారని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక షిర్డీ సాయి ఫోర్‌ వీల్‌ మోటార్‌ వెహికల్‌ అసోసియేషన నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఆందోళన చేపట్టి.. ప్రైవేట్‌ వాహనాలను అడ్డగించి.. ఆ ఆపరేటర్లతో వాగ్వివాదానికి దిగారు. ఉరవకొండ బస్టాండ్‌ వద్ద నుంచే ప్యాసింజర్లను ఎక్కించుకుని తిప్పుతున్నా వీరిపై డిపో మేనేజర్‌ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఉరవకొండ డ్రైవర్స్‌, ఓనర్స్‌, వాహనాలకు మూడు నెలలకు రూ.9వేల దాకా పన్నులు కడుతున్నామని, ప్రైవేట్‌ వాహన ఆపరేటర్ల వల్ల తాము ఆదాయాన్ని కోల్పోతున్నామని వాపోయారు. దీనిపై ఆర్డీసీ డీఎం హంపన్నను వివరణ కోరగా.. ఈ విషయాన్ని ఆర్టీఓ అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Updated Date - Jun 06 , 2025 | 12:06 AM