AHUDA CHAIRMAN: చదువు, క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:53 PM
పాఠశాల స్థాయి నుంచే ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అహుడా చైర్మన టీసీ వరుణ్ అన్నారు.
అనంతపురం క్లాక్‌టవర్, 11(ఆంధ్రజ్యోతి): పాఠశాల స్థాయి నుంచే ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని అహుడా చైర్మన టీసీ వరుణ్ అన్నారు. విద్యానికేతన ఆధ్వర్యంలో శనివారం స్థానిక నీలం సంజీవరెడ్డి పీటీసీ మైదానంలో నిర్వహించిన క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలకు ఆయన ముఖ్య అతిథులుగా హాజరైన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి క్రీడాపోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. టీడీపీ నాయకుడు ఆదెన్న, జనసేన పొదిలి బాబూరావు, విజయ్‌కుమార్, పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు.