ఘనంగా ప్రభుపాదుల ఆవిర్భావోత్సవం
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:49 AM
ఇస్కాన్ సంస్థాపకాచార్యులు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల ఆవిర్భావోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ మందిరంలో ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకలు ఆదివారం ముగిశాయి. శ్రీల ప్రభుపాదులస్వామి ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం ఆయన ఉత్సవమూర్తికి వేదమంత్రోచ్ఛారణల నడుమ వివిధరకాల సుగంధ ద్రవ్యాలు, నదీజలా...
ఇస్కానలో ముగిసిన కృష్ణాష్టమి వేడుకలు
అనంతపురం టౌన, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఇస్కాన్ సంస్థాపకాచార్యులు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల ఆవిర్భావోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ మందిరంలో ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకలు ఆదివారం ముగిశాయి. శ్రీల ప్రభుపాదులస్వామి ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకుని మధ్యాహ్నం ఆయన ఉత్సవమూర్తికి వేదమంత్రోచ్ఛారణల నడుమ వివిధరకాల సుగంధ ద్రవ్యాలు, నదీజలాలు, పండ్లరసాలతో అభిషేకించారు. అనంతరం రాధాపార్థసారధులకు ప్రత్యేక అలంకరణలు, విశేష పూజాకార్యక్రమాలు, దశహారతులు నిర్వహించారు. కార్యక్రమంలో ఇస్కాన్ మందిర చైర్మన దామోదర్ గౌరంగదాస్, సిబ్బంది పాల్గొన్నారు.