provide details భూములు కోల్పోయిన రైతుల వివరాలివ్వండి
ABN , Publish Date - May 24 , 2025 | 11:19 PM
జాతీయ రహదారి (342) విస్తరణలో భూములు కోల్పోయిన రైతుల వివరాలు త్వరగతిన పంపాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య అధికారులను ఆదేశించారు.
ముదిగుబ్బ, మే 24(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి (342) విస్తరణలో భూములు కోల్పోయిన రైతుల వివరాలు త్వరగతిన పంపాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామసుబ్బయ్య అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నారాయణస్వామి, వీఆర్వోలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధిత రైతులతో నివేదికను సమగ్రంగా తయారు చేయాలని, వివరాలు అందిన వెంటనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు