వాటర్ ప్లాంట్‌ను బాగుచేయండి సార్
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:02 AM
మండల కేంద్రంలోని పది సంవత్సరాల క్రితం ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ రూ. లక్షలు వెచ్చించి ఓ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.
కుందుర్పి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పది సంవత్సరాల క్రితం ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ రూ. లక్షలు వెచ్చించి ఓ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం దాన్ని పంచాయతీకి అప్పగించింది. అయితే ఐదు నెలల క్రితం వాటర్ ప్లాంట్‌లోని పనిముట్లు చెడిపోవడంతో.. దాన్ని బాగు చేయించకుండా అధికారులు మూసివేశారు. దీంతో ప్రజలు తాగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరుపయోగంగా ఉండటంతో రూ. లక్షల విలువైన యంత్రాలు సైతం దెబ్బతినే ప్రమాదముందని, దానికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.