Share News

పంచాయతీ అధికారుల దాడులు

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:39 AM

పట్టణంలో ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు విక్రయిస్తున్న వ్యాపార సముదాయాలపై మేజర్‌ పంచాయతీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. పంచాయతీ ఈఓ సుబ్రహ్మణ్యం, గుమస్తా సాయిసంజయ్‌, సిబ్బంది దుకాణాల్లో సోదాలు నిర్వహి ంచారు.

పంచాయతీ అధికారుల దాడులు
స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్‌ వస్తువులు

ప్లాస్టిక్‌ వస్తువులు స్వాధీనం

గోరంట్ల, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): పట్టణంలో ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు విక్రయిస్తున్న వ్యాపార సముదాయాలపై మేజర్‌ పంచాయతీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. పంచాయతీ ఈఓ సుబ్రహ్మణ్యం, గుమస్తా సాయిసంజయ్‌, సిబ్బంది దుకాణాల్లో సోదాలు నిర్వహి ంచారు. మద్యం దుకాణాలు, బెల్టుషాపుల వద్ద దుకాణాల్లో పెద్ద ఎత్తున ప్లాస్టిక్‌ గ్లాసుల బ్యాక్స్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇతర దుకాణాల్లో ప్లాస్టిక్‌ కవర్లను స్వాధీనం చేసుకుని చివరిగా హెచ్చరించారు. ఎస్సీకాలనీలో ముజబేర్‌ రహమాన ప్లాస్టిక్‌ కవర్లు విక్రయిస్తున్నాడన్న సమాచారంతో సోదా చేసి వాటిని స్వాధీనం చేసుకుని రూ.రెండువేల జరిమానా విధించారు. అంతేకాకుండా వాటిని సరఫరా చేస్తున్న హిందూపురం హోల్‌సెల్‌ వ్యాపారిని ఫోనద్వారా అధికారులు మందలించారు. దాదాపు రూ.30వేల విలువల చేసే ప్లాస్టిక్‌గ్లాస్లులు, కవర్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - Aug 06 , 2025 | 01:39 AM