Petrol పెట్రో ధరలు తగ్గించాలి
ABN , Publish Date - Apr 10 , 2025 | 12:33 AM
పెంచిన గ్యాస్, పెట్రో, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.

ధర్మవరం, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): పెంచిన గ్యాస్, పెట్రో, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక కళాజ్యోతి సర్కిల్‌లో నిరసన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మరింత ఆర్థిక భారాలను మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. పెంచిన పెట్రో ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసన కా ర్యక్రమాలు చేపడతామని హె చ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎస్‌హెచబాషా, సీఐటీయూ మండల కన్వీనర్ జేవీ రమణ నాయకులు అయూబ్‌ఖాన, ఎల్ ఆదినారాఆయణ, హైదర్‌వలీ, చేనేత నాయకులు హరి, వెంకటస్వామి, ఖాదర్‌బాషా పాల్గొన్నారు.