Share News

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేకు వినతులు

ABN , Publish Date - Oct 08 , 2025 | 11:36 PM

ప్రజా సమస్యలు పరిష్కరించాలని పలువురు పట్టణ, గ్రామీణ ప్రాంతవాసులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకి వినతిపత్రాలు అందజేశారు

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేకు వినతులు
సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

కళ్యాణదుర్గం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలు పరిష్కరించాలని పలువురు పట్టణ, గ్రామీణ ప్రాంతవాసులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకి వినతిపత్రాలు అందజేశారు. బుధవారం స్థానిక ప్రజావేదికలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ప్రజా సమస్యల పై వినతులు స్వీకరించిన ఆయన వాటిని వెంటనే పరిష్కరించాలని ఆయా అధికారులను ఆదేశించారు. చేనేత కార్డులు మంజూరు చేయించాలని, బ్రహ్మసముద్రం మండలం నుంచి గుండిగానిపల్లికి ఆ ర్టీసీ బస్సును నడిపేలా చూడాలని ఎమ్మెల్యేకు కురుబ సంఘం నాయకులు విన్నవించారు. అలాగే కుందుర్పి మండలం రుద్రంపల్లిలో వర్షాలకు ఇళ్లు కూలి తల్లిదండ్రులు మృతి చెందగా, అనాథగా మారిన కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రాన్ని అందచేశారు.

Updated Date - Oct 08 , 2025 | 11:36 PM