వేరుశనగకు తెగుళ్లు
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:29 AM
మండలంలో రబీలో బోరుబావుల కింద సాగుచేసిన వేరుశనగ పంటకు పొగమంచు కారణంగా తిక్కాకు తెగులు, అగ్గి, పచ్చపురుగు తెగుళ్లు సోకాయి.
శెట్టూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : మండలంలో రబీలో బోరుబావుల కింద సాగుచేసిన వేరుశనగ పంటకు పొగమంచు కారణంగా తిక్కాకు తెగులు, అగ్గి, పచ్చపురుగు తెగుళ్లు సోకాయి. సాగుచేసిన నెల రోజుల్లోనే నాలుగుసార్లు మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకపోయిందని అన్నదాతలు వాపోతున్నారు. దీనిపై వ్యవసాయాధికారిణి వాసుకీరాణిను వివరణ కోరగా... వేరుశనగలో మచ్చ తెగుళ్ల నివారణకు కాంటాప్ 2ఎంఎల్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. అగ్గి తెగులుకు ఒక లీటరు నీటికి ప్రొక్నోపాస్ రెండు ఎంఎల్ మందు కలిపి పిచికారి చేయాలని సూచించారు.