Share News

టీచర్ల అంతర్‌జిల్లా బదిలీలకు గ్రీనసిగ్నల్‌

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:17 AM

ఉపాధ్యాయుల అంతర్‌జిల్లా బదిలీలకు ప్రభుత్వం గ్రీనసిగ్నల్‌ ఇచ్చింది. కొన్నేళ్లుగా ఈ బదిలీల కోసం అనేక మంది ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసికెళ్లడంతో అంతర్‌జిల్లా బదిలీలకు ఆమోదం తెలిపారు. బుధవారం విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కోన శశిధర్‌ అంతర్‌జిల్లా బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేశారు.

టీచర్ల అంతర్‌జిల్లా బదిలీలకు గ్రీనసిగ్నల్‌

అనంతపురం విద్య, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల అంతర్‌జిల్లా బదిలీలకు ప్రభుత్వం గ్రీనసిగ్నల్‌ ఇచ్చింది. కొన్నేళ్లుగా ఈ బదిలీల కోసం అనేక మంది ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ దృష్టికి తీసికెళ్లడంతో అంతర్‌జిల్లా బదిలీలకు ఆమోదం తెలిపారు. బుధవారం విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కోన శశిధర్‌ అంతర్‌జిల్లా బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ బదిలీలలో కేవలం ఇరు పక్కల టీచర్ల కేడర్‌కు మాత్రమే అవకాశం కల్పించారు. బదిలీ కోరుకునే టీచర్లు ఆనలైనలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అపుడే పలువురు టీచర్లు మ్యూచువల్‌ కోసం వాట్సాప్‌ గ్రూపులలో విల్లింగ్‌ అడుగుతూ మెసేజ్‌లు పెడుతున్నారు.

ఉత్తమ టీచర్ల అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

అనంతపురం విద్య, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబరు 5న జిల్లా స్థాయి ఉత్తమ టీచర్ల అవార్డులు ప్రదానం చేస్తామని, ఈ మేరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈఓ ప్రసాద్‌బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డులకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జడ్పీ, మున్సిపల్‌, ఎయిడెడ్‌, మోడల్‌స్కూల్స్‌, కేజీబీవీలు, రెసిడెన్సియల్‌ స్కూల్స్‌, డైట్‌ కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్‌, హెచఎంలు, టీచర్లు అర్హులని పేర్కొన్నారు. కనీసం 10 ఏళ్లు సర్వీస్‌ ఉండాలని, గతంలో జిల్లా స్థాయి అవార్డు పొంది ఉండకూడదని, ఎలాంటి క్రిమినల్‌ కేసులు నమోదై ఉండకూడదని, శాఖాపరమైన చర్యలు ఉండరాదని పేర్కొన్నారు. జాతీయ స్థాయి అవార్డులకు దరఖాస్తు చేసిన టీచర్లు ఇందుకు అనర్హులని తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న టీచర్లు ఈనెల 28 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు జిల్లా కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందని డీఈఓ పేర్కొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 12:17 AM