ఒక రోజు ముందే పింఛన
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:04 PM
పింఛనదారులు ఒక రోజు ముందే పింఛన పంపిణీ చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
రాయదుర్గం, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): పింఛనదారులు ఒక రోజు ముందే పింఛన పంపిణీ చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా పట్టణంలోని 24, 25 వార్డుల్లో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ఇంటింటికి వెళ్లి బుధవారం పింఛన్లను పంపిణీ చేశారు.
కళ్యాణదుర్గం : కంబదూరు మండలం రాళ్లఅనంతపురంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పింఛన పంపిణీ చేశారు. కంబదూరు నుంచి రాళ్లఅనంతపురం వరకు రూ.3 కోట్లతో తారు రోడ్డు మంజూరైందని, త్వరలోనే ఆ పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.