Peanut seeds వేరుశనగ విత్తనకాయలు ఇవ్వాలి
ABN , Publish Date - May 24 , 2025 | 11:20 PM
కరువుతో అల్లాడుతున్న రైతులకు ఈ యేడు ఖరీ్‌ఫలో 90శాతం సబ్సిడీతో విత్తన వేరుశనగ సరఫరా చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది
ఓబుళదేవరచెరువు, మే 24(ఆంధ్రజ్యోతి): కరువుతో అల్లాడుతున్న రైతులకు ఈ యేడు ఖరీ్‌ఫలో 90శాతం సబ్సిడీతో విత్తన వేరుశనగ సరఫరా చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. శనివారం సీఐటీయూ జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, సీపీఎం నేత సున్నపల్లి రమణ స్థానికంగా మీడియాతో మాట్లాడారు. ముందస్తుగా వర్షాలు పడటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారని, అయితే ఇంతవరకు విత్తన వేరుశనగ పంపిణీ ఏర్పాట్ల ప్రక్రియ ప్రారంభం కాలేదని అన్నారు. రైతులకు ప్రత్యామ్నాయ విత్తనాలు అందించలేదన్నారు. పెట్టుబడి సాయం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బ్యాంక్‌లో రుణాల రెన్యువల్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమావేశంలో సీఐటీయూ నేతలు కుళ్లాయప్ప, గంగులప్ప, రైతులు రామక్రిష్ణ, శంకర్, రామాంజి, కొండప్ప, అనంత, సత్యప్ప పాల్గొన్నారు.