Share News

Pavagada శనైశ్చరుడికి ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Aug 16 , 2025 | 11:58 PM

చరిత్ర ప్రసిద్ధిచెందిన పావగడ శీతలాంబ, జేష్టాదేవి సమేత శనైశ్చరస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. శ్రావణమాసం నాల్గవ శనివారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరై తైలాభిషేకం, నవగ్రహపూజ, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. దావణగిరి, చిత్రదుర్గం, బళ్లారి, అనంతపురం, కళ్యాణదుర్గం నుంచి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

Pavagada శనైశ్చరుడికి ప్రత్యేక పూజలు
ప్రత్యేక అలంకరణలో స్వామివారు

పావగడ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): చరిత్ర ప్రసిద్ధిచెందిన పావగడ శీతలాంబ, జేష్టాదేవి సమేత శనైశ్చరస్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. శ్రావణమాసం నాల్గవ శనివారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరై తైలాభిషేకం, నవగ్రహపూజ, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. దావణగిరి, చిత్రదుర్గం, బళ్లారి, అనంతపురం, కళ్యాణదుర్గం నుంచి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 50వేల మందికి పైగా భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ తెలిపారు.

పట్టణానికి సమీపంలో ఉన్న కురుబరహళ్లి గేటులో వెలసిన దేవగిరి వెంకటేశ్వరస్వామికి నాలుగవ శ్రావణశనివారం సందర్భంగా ప్రత్యేకంగా వెన్నతో అభిషేకం చేశారు. ఉదయం నుంచి భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు.

Updated Date - Aug 16 , 2025 | 11:58 PM