26 నుంచి పట్టాభిరామస్వామి బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:20 PM
స్థానిక పట్టాభిరామస్వామి ఆలయంలో జనవరి 26 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ ఆలయ కమిటీసభ్యులు తెలిపారు.
కళ్యాణదుర్గం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక పట్టాభిరామస్వామి ఆలయంలో జనవరి 26 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ ఆలయ కమిటీసభ్యులు తెలిపారు. అందుకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆ ఆలయంలో ఆవిష్కరించిన వారు మాట్లాడారు. ముఖ్యంగా జనవరి 30న సీతారాముల కల్యాణం, గరుడోత్సవం, ఫిబ్రవరి ఒకటిన మడుగుతేరు, బ్రహ్మరథోత్సవం, డోలోత్సవం, 3న మహా పూర్ణాహుతి, కంకణ విసర్జన, చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. ఏడో తేదీన స్థానిక కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో గరికపాటి నరసింహారావు ప్రవచనం ఉంటుందన్నారు.