Share News

weapons ఓపిక, సహనమే ఆయుధాలు

ABN , Publish Date - May 23 , 2025 | 11:02 PM

‘ గత వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని వేధించడమే లక్ష్యంగా పాలన సాగించింది. ధర్మవరం టీడీపీ నాయకులు, కార్యకర్తలను మరీ ఎక్కువగా ఇ బ్బందుల పాలు చేసింది. అయినా వారు టీడీపీని వీడలేదు. ఐదేళ్ల పాటు ఓపిక, సహనం పట్టారు. ఆ ఆయుధాలను నేను వారి నుంచే నే ర్చుకున్నా. ఆ ఆయుధాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టారు. ’ అని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు.

 weapons ఓపిక, సహనమే ఆయుధాలు
మినీమహానాడులో మాట్లాడుతున్న పరిటాల శ్రీరామ్‌

ధర్మవరం, మే 23 (ఆంధ్రజ్యోతి): ‘ గత వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని వేధించడమే లక్ష్యంగా పాలన సాగించింది. ధర్మవరం టీడీపీ నాయకులు, కార్యకర్తలను మరీ ఎక్కువగా ఇ బ్బందుల పాలు చేసింది. అయినా వారు టీడీపీని వీడలేదు. ఐదేళ్ల పాటు ఓపిక, సహనం పట్టారు. ఆ ఆయుధాలను నేను వారి నుంచే నే ర్చుకున్నా. ఆ ఆయుధాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ కొట్టారు. ’ అని టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ అన్నారు. ధర్మవరం నియోజకవర్గ మినీమహానాడు కార్యక్రమాన్ని స్థానిక మారుతీ రాఘవేంద్రస్వామి కల్యాణ మండపంలో నియోజకవర్గ క్లస్టర్‌ ఇనచార్జ్‌ చింతలపల్లి మహేశ చౌదరి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. మొదట ఎన్టీఆర్‌, పరిటాల రవీంద్ర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పరిటాల శ్రీరా మ్‌ మాట్లాడుతూ.. ప్రజలను వైసీపీ నుంచి వియుక్తి కల్పించాలనే లక్ష్యంగా నాడు ఎన్నికల్లో పోరాటం చేశామని, ఎమ్మెల్యే పదవిని ఆశించలేదని అన్నారు. అయితే గత 11 నెలలుగా కొం దరు డబుల్‌ గేమ్‌ ఆడుతూ రాజకీయాలు చేస్తున్నారని, వారిపట్ల సహనంగా ఉండాలని, ఎవ రూ అధైర్య పడరాదని, త్వరలో మంచి రోజులు వస్తాయని అన్నారు. కార్యకర్తలకు ఏ సమయంలోనైనా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో నాయకులు స్వేచ్ఛగా కార్యాలయాలకు వెళ్లి ప్రజలకు కోసం పనిచేయించుకోవాలన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు అంజినప్ప మాట్లాడుతూ... ధర్మవరంలో కూటమి గెలుపు కోసం టీడీపీ కార్యకర్తలు చేసిన కష్టాన్ని ఎవరూ మరువలేరన్నారు. ధర్మవరంలో కార్యకర్తలు ఎదుర్కొంటున్న కష్టాలను జిల్లా ఇనచార్జ్‌ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లామని, మహానాడు అనంతరం ఽధర్మవరం నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీసీడ్స్‌ రాష్ట్ర కార్పొరేషన డైరెక్టర్‌ కమతం కాటమయ్య, చేనేత ప్రముఖుడు, టీడీపీ నాయకుడు సంధారాఘవ, నియోజకవర్గంలోని టీడీపీ మండల కన్వీనర్‌లు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 11:02 PM