కూటమితోనే పంచాయతీల అభివృద్ధి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:23 AM
గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో పంచాయతీల అభివృద్ధికి కేవలం రూ. 200 కోట్లు ఇస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే రూ. 1200 కోట్లు మంజూరు చేసిందని, పంచాయతీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు.
కళ్యాణదుర్గం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లలో పంచాయతీల అభివృద్ధికి కేవలం రూ. 200 కోట్లు ఇస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లోనే రూ. 1200 కోట్లు మంజూరు చేసిందని, పంచాయతీల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యంచేస్తే.. కూటమి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసి.. ఆ వ్యవస్థకు పూర్వవైభవం తెచ్చిందన్నారు. గురువారం స్థానిక ప్రజావేదికలో నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులతో కలిసి సీఎం చంద్రబాబు, డీసీఎం పవనకళ్యాణ్ చిత్రపటాలకు గురువారం క్షీరాభిషేకం చేసిన ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీరాజ్ ఉద్యోగులను ఏ మాత్రం పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం వారికి ఉద్యోగోన్నతులు ఇచ్చిందని, పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ డెవల్‌పమెంట్ అధికారిగా గుర్తింపు ఇచ్చిందని అన్నారు. కావున పంచాయతీరాజ్ అధికారులు ప్రజా సమస్యలు పరిష్కరించి.. అభివృద్ధికి బాటలు వేయాలన్నారు.