పంచాయతీ కార్యదర్శికి మందలింపు
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:22 AM
‘మేడం.. సచివాలయ భవనం పాతదై.. కూలేందుకు సిద్ధంగా ఉంది. వర్షాలు వస్తుండటంతో మొత్తం కారుతోంది. పాములు తిరుగుతున్నాయ్.. ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహస్తున్నాం. సచివాలయానికి నిర్మించిన కొత్త భవనం ఆరు నెలలుగా నిరుపయోగంగా ఉంది. అందులో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోండి..’ అని డొనేకల్లు గ్రామ కార్యదర్శి శ్రీదేవి ఎంపీడీఓ షకీలా బేగంను విజ్ఞప్తి చేయడమే నేరమైంది.
విడపనకల్లు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ‘మేడం.. సచివాలయ భవనం పాతదై.. కూలేందుకు సిద్ధంగా ఉంది. వర్షాలు వస్తుండటంతో మొత్తం కారుతోంది. పాములు తిరుగుతున్నాయ్.. ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహస్తున్నాం. సచివాలయానికి నిర్మించిన కొత్త భవనం ఆరు నెలలుగా నిరుపయోగంగా ఉంది. అందులో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోండి..’ అని డొనేకల్లు గ్రామ కార్యదర్శి శ్రీదేవి ఎంపీడీఓ షకీలా బేగంను విజ్ఞప్తి చేయడమే నేరమైంది. గురువారం ఆమెను ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు నిలుచోబెట్టి మందలించారు. ‘పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు నీకు నూతన సచివాలయ భవనాన్ని అప్పగిస్తే నీవు వెళ్లకుండా మా మీద పడి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్.. చేతనైతే మరో అద్దె ఇళ్లు మాట్లాడుకో.. లేదా హెల్త్ క్లీనిక్‌లో ఉండండి. ఇవీకాదంటే కాంట్రాక్టర్‌తో నువ్వే మాట్లాడుకొని తాళాలు ఇప్పించుకో..’ అంటూ ఎంపీడీఓ, ఆ అధికారులు చేతులు ఎత్తేశారు. సిబ్బంది సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు.. సమస్యను మీరే పరిష్కరించకోండని మందలించడంతో సచివాలయ ఉద్యోగులు అర్థంకాని పరిస్థితిలో ఉండిపోయారు.