Share News

జోరుగా వరి నాట్లు

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:39 PM

తుంగభద్ర ఎగువ కాలువ పరవళ్లు తొక్కుతోంది. పుష్కలంగా సాగునీటిని విడదల చేస్తున్నారు. బ్రాంచ కాలువల నుంచి మైనర్‌ కాల్వల వరకు నీటితో కళకళలాడుతున్నాయి.

జోరుగా వరి నాట్లు
వరి నాట్లు వేస్తున్న కూలీలు

బొమ్మనహాళ్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర ఎగువ కాలువ పరవళ్లు తొక్కుతోంది. పుష్కలంగా సాగునీటిని విడదల చేస్తున్నారు. బ్రాంచ కాలువల నుంచి మైనర్‌ కాల్వల వరకు నీటితో కళకళలాడుతున్నాయి. దాదాపు అన్ని కాలువలకు నీటిని సరఫరా చేస్తుండటంతో పంటల సాగు ఊపందుకుంది. ఇప్పటికే వరి నారుమళ్లు పోసిన రైతులు వరి నాట్లు వేసుకోనేందకు బిజిగా ఉన్నారు. రానున్న వారం రోజుల్లో వరినాట్లు పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నారు. మండలంలోని ఉద్ధేహాళ్‌, రంగాపురంక్యాంపు, క్రిష్ణాపురం తదితర గ్రామాల్లో వరి నాట్లు ప్రారంభమయ్యాయి. రెండు రోజులుగా వర్షలు కురుస్తుండంతో పంటలు సాగులో అన్నదాతలు తీరికలేకుండా ఉన్నారు. ట్రాక్టర్ల నిర్వాహకులకు చేతి నిండా పని లభిస్తోంది. వ్యవసాయ కూలీలకు పుష్కలంగా పనులు దొరుకుతున్నాయి. హెచ్చెల్సీకి సాగునీరు రావడంతో వరినాట్లు జోరందుకున్నాయి. దీంతో గ్రామాల్లో కూలీల కొరత ఏర్పడింది. కర్ణాటక ప్రాంతల నుంచి కూలీలను పిలిపించి నాట్లు వేయిస్తున్నారు. తక్కువ ఖర్చుతో నాట్లు వేస్తున్నా కూలీల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఎకరా పొలం నాట్లు వేసేందకు రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ముందస్తుగా వర్షాలు రావడం తుంగభద్ర డ్యాం నిండుకోవడం ఎగువవకాలువకు నీరు మందుగానే రావడంతో కొందరు రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటుండగా, మరి కొందరు నాట్లు సైతం పూర్తి చేశారు. మండలంలో వరి దాదాపు 15వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నాటికి పూర్తిగా రైతులు వరిపంట నాట్లు వేసే అవకాశముంది.

Updated Date - Aug 10 , 2025 | 11:39 PM