పీఏబీఆర్‌కు జలకళఫ
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:21 AM
పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం) నీటితో కళకళలాడుతుంది. ప్రస్తుతం డ్యాంలో నాలుగు టీఎంసీల నీటి నిల్వ ఉంది. డ్యాంలో నీటి మట్టం గేట్ల వద్దకు చేరడంతో ఇరిగేషన ఎస్‌ఈ సుధాకర్, డీఈ వెంకటరమణ సోమవారం పరిశీలించారు.
డ్యాంలో నాలుగు టీఎంసీల నిల్వకూడేరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్ డ్యాం) నీటితో కళకళలాడుతుంది. ప్రస్తుతం డ్యాంలో నాలుగు టీఎంసీల నీటి నిల్వ ఉంది. డ్యాంలో నీటి మట్టం గేట్ల వద్దకు చేరడంతో ఇరిగేషన ఎస్‌ఈ సుధాకర్, డీఈ వెంకటరమణ సోమవారం పరిశీలించారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పీఏబీఆర్ డ్యాంలోకి 1672 క్యూసెక్కుల ఇన ఫ్లో ఉందని డీఈ వెంకటరమణ తెలి పారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీనీవా ఫేజ్-2 కాలువకు అధికారులు నీరు వదలడంతో, పీఏబీఆర్ డ్యాంకు వస్తున్న నీరు తగ్గిముఖం పట్టింది. గతంతో 1860 క్యూసెక్కుల నీరు వస్తుండగా, సోమవారం 1672 క్యూసెక్కులకు తగ్గింది. మరో వారం రోజులకు పూర్తిగా తగ్గిపోతుందని అధికారుల ద్వారా తెలిసింది. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీరు తగ్గిపోతే తుంగభద్ర డ్యాం నుంచి వస్తున్న నీటిని లింక్ చానల్ ద్వారా పీఏబీఆర్ డ్యాంలోకి మళ్లించి ఐదు టీఎంసీలు నిల్వ చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.