పీఏబీఆర్ డ్యామ్‌కు మరమ్మతులు చేపట్టాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 11:46 PM
జిల్లాకు సాగు, తాగు నీరు అందించే పీఏబీఆర్ డ్యామ్‌లో 11 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, రైతు సంఘం జిల్లా నాయకుడు మల్లికార్జున డిమాండ్ చేశారు.
కూడేరు, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాకు సాగు, తాగు నీరు అందించే పీఏబీఆర్ డ్యామ్‌లో 11 టీఎంసీల నీటిని నిల్వ చేసేలా పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, రైతు సంఘం జిల్లా నాయకుడు మల్లికార్జున డిమాండ్ చేశారు. మండలంలోని పీఏబీఆర్ డ్యామ్‌ను శనివారం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించిన వారు మాట్లాడారు. డ్యామ్‌కు ఏర్పడ్డ లీకేజీల కారణంగా నీటిని నిల్వ స్థాయి ఐదు టీఎంసీలకు పడిపోయిందన్నారు. డ్యామ్‌కు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేస్తే 49 చెరువులకు సాగు, తాగు నీరు అందించవచ్చని, జిల్లాలో సాగు విస్తీర్ణం పెరుగుతుందని, దీనిపై మంత్రి పయ్యావుల కేశవ్, కలెక్టర్ ఆనంద్ చొరవ చూపాలని అన్నారు. పీఏబీఆర్ డ్యామ్ నుంచి కుడికాలువకు ఐదు టీఎంసీల నీరు ఇస్తామని జీఓలు ఇచ్చారే తప్ప దాన్ని అమలు చేయలేదన్నారు. కుడి కాలువకు ద్వారా ఉరవకొండ, శింగనమల, రాప్తాడు, ధర్మవరం నియోజక వర్గాల్లో ఉన్న చెరువులకు నీటిని మళ్లించి రైతులను ఆదుకోవాలన్నారు. వారి వెంట రాజారెడ్డి, మల్లికార్జున, కేశవరెడ్డి, పెరుగుసంగప్ప, మండల కార్యదర్శి నాగేంద్ర, రమణ, రమణప్ప, నారాయణమ్మ, మలరాయుడు ఉన్నారు.