Share News

ఆరుబయటే మధ్యాహ్న వంటలు

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:51 PM

మ ధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట గదులు లేక పోవడంతో ఆరు బయటే వంటలు తయారుచేస్తున్నారు.

ఆరుబయటే మధ్యాహ్న వంటలు
నెరమెట్లలో ఆరుబయట వంటలు చేస్తున్న నిర్వాహకులు

ఉరవకొండ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): మ ధ్యాహ్న భోజన నిర్వాహకులు వంట గదులు లేక పోవడంతో ఆరు బయటే వంటలు తయారుచేస్తున్నారు. నాడు- నేడు కింద కొన్ని పాఠశాలలకు కిచెన షెడ్లను మంజూరు చేశారు. నాడు- నేడు పనులకు నిధులు ఆగిపోవడంతో గదుల నిర్మాణం పనులు అర్థాంతరంగా ఆగిపోయాయి. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు తాత్కలికంగా షెడ్ల ను వేసుకుని వంటలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వజ్రకరూరు మండలంలోని ఆరు పాఠశాలలో వంట గదులు లేవు. దీంతో ఆరు బయటే వంటలు చేస్తున్నారు. కొనకొండ్ల ప్రధాన పాఠశాలలో అదనపు గదులలోనే వంటలను తయారు చేస్తున్నారు. గడేహోతూరు జిల్లా పరిషత పాఠశాలలో తాత్కాలికంగా బండలు నాటుకుని.. వాటి మధ్య వంటలు చేస్తున్నారు. అలాగే ఉరవకొండ మండలంలో 10 పాఠశాలల్లో వంట గదులు లేవు. 12 జిల్లా పరిషత పాఠశాలలో కే వలం రెండు చోట్ల మాత్రమే వంట గదులు ఉన్నాయి. నెరమెట్ల, బూదగవి, వై.రాంపురం జిల్లా పరిషత హైస్కూల్‌లో కిచెన షెడ్‌ నిర్మా ణం పనులు ఆగిపోయాయి. దీనిపై వజ్రకరూరు ఎంఈవో-2 తిమ్మప్పను వివరణ కోరగా.. నాడు నేడు కింద ఈ పనులు చేపట్టారని, నిధులు రాకపోవడంతో పనులు ఆగిపోయాయని అన్నా రు. వంట గదుల నిర్మాణాలపై జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Updated Date - Dec 19 , 2025 | 11:51 PM