విజృంభిస్తున్న విష జ్వరాలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 11:43 PM
పట్టణం, సమీప గ్రామాల్లో సీజనల్ వ్యాధులు విజృంభించాయి. స్థానిక ప్రభుత్వ వైద్య విధాన పరిషత ఆసుపత్రి జ్వరాల బాధితులతో సోమవారం కిటకిటలాడింది
ఉరవకొండ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): పట్టణం, సమీప గ్రామాల్లో సీజనల్ వ్యాధులు విజృంభించాయి. స్థానిక ప్రభుత్వ వైద్య విధాన పరిషత ఆసుపత్రి జ్వరాల బాధితులతో సోమవారం కిటకిటలాడింది. ఓపీ చీటీల కోసం రోగులు క్యూ కట్టారు. ఇప్పటికే ఆసుపత్రిలో 30 మంది దాకా చికిత్స పొందుతున్నారు. ఉరవకొండ సీహెచసీకి రోజు 400 దాకా ఓపీ చూస్తుంటే.. అందులో జ్వరాలతో బాధపడుతున్న వారే అధికంగా ఉన్నారు. మరో వైపు పీహెచసీల్లో డాక్టర్లు సరిగా చూడక పోవడం వల్లనే గ్రామీణ ప్రజలు సీహెచసీ వస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి.