Organic market కలెక్టరేట్‌లో ఆర్గానిక్ మార్కెట్
ABN , Publish Date - May 05 , 2025 | 11:46 PM
కలెక్టరేట్ ఆవరణంలో ఆర్గానిక్ మా ర్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య సోమవారం తెలిపారు.
పుట్టపర్తి, మే 5(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్ ఆవరణంలో ఆర్గానిక్ మా ర్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య సోమవారం తెలిపారు. రసాయన ఎరువులు లేకుండా ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన ఉత్పత్తులు, ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాలు సాగు చేసిన వేరుశెనగ, కొర్రలు, సాము లు, పరకలు, జొన్నలు, కూరగాయలను కలెక్టరేట్ ఆవరణంలో ఇక నుంచి ప్రతి సోమవారం విక్రయానికి ఉంచుతున్నట్లు చెప్పారు.