Share News

సేంద్రియానికే సై

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:07 AM

పంటలకు రసాయనిక ఎరువులు వాడకం ద్వారా కలుగుతున్న అనర్థాలపై రైతుల్లో చైతన్యం వచ్చింది. రసాయనిక ఎరువుల వాడకంతో పంట పెట్టుబడి, ఖర్చులు కూడా భారీగా వస్తున్నాయి.

సేంద్రియానికే సై
పొలంలో వేసిన సేంద్రియ ఎరువు

కళ్యాణదుర్గం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పంటలకు రసాయనిక ఎరువులు వాడకం ద్వారా కలుగుతున్న అనర్థాలపై రైతుల్లో చైతన్యం వచ్చింది. రసాయనిక ఎరువుల వాడకంతో పంట పెట్టుబడి, ఖర్చులు కూడా భారీగా వస్తున్నాయి. భూసారమూ నానాటికీ తగ్గిపోతోంది. చీడ పీడలు అధికమవుతున్నాయి. దీంతో రైతులు సేంద్రియ ఎరువుల వాడకంపై మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం కూడా వ్యవసాయాశాఖాధికారుల ద్వారా వారికి తగు సూచనలు సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. దీంతో రానురాను సేంద్రియ ఎరువులకు డిమాండ్‌ పెరుగుతోంది. చెత్త ద్వారా సంపద సృష్టి కార్యక్రమం ద్వారా సేంద్రియ ఎరువులను రైతులకు అందుబాటులోకి తెస్తోంది. రైతులు భూసారాన్ని పెంపొందించుకునే పశువుల పేడ కుంటలు, మేక, గొర్రెల పేడలు పొలాలకు తోలుతున్నారు. మరికొందరు రైతులు పాడి ఎరువులను కొనుగోలు చేస్తున్నారు. వేరుశెనగ పంటతో పాటు కర్భూజా, కళింగర, టమోటా, గెనసగడ్డ, బొప్పాయి, మిర్చి, బీర పంటలకు కూడా సేంద్రియ ఎరువులను ఉపయోగిస్తున్నారు. ఈ ఎరువులు వాడడం వలన వ్యవసాయ ఖర్చులు తగ్గడమే కాకుండా పంట దిగుబడి పెరుగుతోంది

Updated Date - Dec 02 , 2025 | 12:08 AM