రేషన షాపుల్లో బహిరంగ దోపిడీ
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:33 PM
ప్రతి నెలా కొందరు డీల ర్లు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. గుంతకల్లు పట్టణంలో 70, మం డలంలో 39 రేషన షాపులు ఉన్నాయి, దాదాపు 42 వేల కార్డులు ఉన్నాయి.
గుంతకల్లుటౌన, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ప్రతి నెలా కొందరు డీల ర్లు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. గుంతకల్లు పట్టణంలో 70, మం డలంలో 39 రేషన షాపులు ఉన్నాయి, దాదాపు 42 వేల కార్డులు ఉన్నాయి. పలు రేషన దుకాణాల్లో బి య్యంతో పాటు సుమారు ఒకటిన్నర కిలోల బరువున్న డబ్బాను ఉంచి.. తూ కం వేసి లబ్ధిదారులకు వేస్తున్నారు. 20 కేజీల బియ్యాన్ని ఒక సారి ఇలా తూకం వేసి ఇస్తారు. కార్డులకు 35 కేజీల బియ్యం ఇవ్వాల్సి వస్తే.. రెండు సార్లు తూకం వేసి ఇస్తారు. అంటే అప్పుడు మొత్తం మూడు కేజీల బియ్యాన్ని తక్కువగా ఇస్తారు. దీనిపై లబ్ధిదారులు ప్రశ్ని స్తే.. స్టాక్ పాయింట్‌లో వంద కేజీల ప్యాకెట్‌కు తూకం తక్కువ వ స్తుందని, ప్రతి నెలా అధికారులకు మామూళ్లు ఇస్తున్నామని.. డీలర్లు దబాయిస్తున్నా రు. ఇలా డీలర్లు ప్రతి కార్డు మీద బియ్యాన్ని దోపిడీ చే స్తూ... ప్రతి నెలా రూ. లక్షలు దండుకుంటున్నారు. ఇలా వీరు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నా.. రెవెన్యూ, తూనికల శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారే తప్పా.. ఏ మా త్రం చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై ఫిర్యాదు చేస్తేనే తాము స్పందిస్తామని వారు తెగేసి చెబుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌కు వివరణ కోరేందుకు ఫోన చేయగా లిఫ్ట్ చేయలేదు.