Share News

అయ్యో.. అరటి..!

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:15 AM

మహారాష్ట్రలో అరటి దిగుబడి ఎక్కువగా ఉండడం, అరబ్‌ దేశాలకు ఎగుమతులు తగ్గిపోవడంతో అరటి ధర దారుణంగా పడిపోయింది.

అయ్యో.. అరటి..!
రోడ్డు పక్కన పారేసిన అరటి కాయలను తింటున్న గొర్రెలు

యాడికి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): మండలంలో పలువురు రైతులు ఏడాదిగా రూ. లక్షల వెచ్చించి.. అరటిని సాగు చేశారు. మహారాష్ట్రలో అరటి దిగుబడి ఎక్కువగా ఉండడం, అరబ్‌ దేశాలకు ఎగుమతులు తగ్గిపోవడంతో అరటి ధర దారుణంగా పడిపోయింది. దీంతో పలువురు రైతులు పంటను అలాగే వదిలేశారు. మరికొందరు పంటను పశువుల కోసం రోడ్డు పక్కన పడేస్తున్నారు. మండలంలోని రామరాజుపల్లి రైతు చరణ్‌ అరటి పంటను ట్రాక్టర్‌లో తరలించి మంగళవారం రోడ్డు పక్కన ఇలా పడేసి వెళ్లగా.. అటువైపు వెళుతున్న గొర్రెలు, మేకలు ఆ పంటను తినడం కనిపించింది.

Updated Date - Nov 12 , 2025 | 12:15 AM