వైసీపీకి అధికారుల అండ.!
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:53 PM
మండలంలోని శ్రీధరఘట్టలో వాటర్ ప్లాంట్ ను టీడీపీ ప్రభుత్వం 2018లో ఏర్పాటు చేసిం ది. కొద్ది నెలలకే వైసీపీ అధికారంలోకి రావడంతో దాని నిర్వహణ బాధ్యతలు వైసీపీ మద్దతుదారులు తీసుకున్నారు.
బొమ్మనహాళ్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని శ్రీధరఘట్టలో వాటర్ ప్లాంట్ ను టీడీపీ ప్రభుత్వం 2018లో ఏర్పాటు చేసిం ది. కొద్ది నెలలకే వైసీపీ అధికారంలోకి రావడంతో దాని నిర్వహణ బాధ్యతలు వైసీపీ మద్దతుదారులు తీసుకున్నారు. శ్రీధరఘట్టకు వైసీపీ మద్దతుదారుడే సర్పంచగా ఉన్నారు. మరి అధికారుల నిర్లక్ష్యమో.. లేక కొందరి అధికారులు చేతివాటమో తెలీదుగాని.. ఇంతకాలం ఆ ప్లాంట్‌కు విద్యుతశాఖ అధికారులు మీటర్ బిగించలేదు. త్వరలో సర్పంచ పదవీ కాలం ముగియబోతున్న తరుణంలో ఆ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను టీడీపీ మద్దతుదారులకు నెల క్రితం అప్పగించారు. ఇన్నా ళ్లూ పట్టించుకోని విద్యుత అధికారులకు అకస్మాత్తుగా నియమాలు గుర్తొచ్చాయి. వెంటనే వారు ప్లాంట్‌కు విద్యుత మీటర్ బిగించారు. బిల్లు భారీగా రావడంతో తమకు నష్టం వస్తుందని టీడీపీ మద్దతుదారులు రెండు రోజుల క్రితం ఆ ప్లాంట్‌ను మూసివేశారు. దీంతో శుద్ధ నీరు దొరక్క ఆ గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పం దించి వాటర్ ప్లాంట్ తెరిపించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.