పరిశ్రమల దివాలాపై అధికారుల విచారణ
ABN , Publish Date - Sep 18 , 2025 | 12:05 AM
తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో వందకొద్ది ఉన్న నాపరాళ్లు, గ్రానైట్ పరిశ్రమలు దివాలా తీయడానికి కారణాలు ఏంటని జిల్లా ఇండసీ్ట్రయల్ అధికారులు రవీంద్రారెడ్డి, ఎక్స్‌పోర్ట్ అధికారి శివరాం, వైష్ణవి బుధవారం ఆరా తీశారు.
తాడిపత్రి, సెప్టెంబరు17(ఆంధ్రజ్యోతి): తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో వందకొద్ది ఉన్న నాపరాళ్లు, గ్రానైట్ పరిశ్రమలు దివాలా తీయడానికి కారణాలు ఏంటని జిల్లా ఇండసీ్ట్రయల్ అధికారులు రవీంద్రారెడ్డి, ఎక్స్‌పోర్ట్ అధికారి శివరాం, వైష్ణవి బుధవారం ఆరా తీశారు. పలువురు పరిశ్రమ యజమానులతో వారు చర్చించారు. ఎక్స్‌పోర్ట్, ట్రాన్సపోర్టు తదితర అంశాలపై ఆరా తీశారు. పరిశ్రమలకు పూర్వవైభవం రావలంటే ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై పరిశ్రమల యజమానులతో చర్చించారు.