కసాపురంలో ఇరుముడుల సమర్పణ
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:30 AM
కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో తూర్పు రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన గుండంలో హనుమాద్ మాలధారులు మంగళవారం ఇరుముడులు సమర్పించారు
గుంతకల్లుటౌన, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో తూర్పు రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన గుండంలో హనుమాద్ మాలధారులు మంగళవారం ఇరుముడులు సమర్పించారు. ఇరుముడులలోని టెంకాయలు, నెయ్యి పదార్థాలను గుండంలో వేశారు. ఆలయ అధికారులు భక్తులకు అల్పాహారాన్ని చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిన్నారుల భరత నాట్యా ప్రదర్శన ఆకట్టుకుంది.