ఉల్లిపాయ పంట పరిశీలన
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:04 AM
మండలంలోని 75 వీరాపురం, పూలకుంట తదితర గ్రామాల్లో ఉల్లిపంటను హార్టికల్చర్ డీడీ ఉమాదేవి బుధవారం పరిశీలించారు.
గుమ్మఘట్ట, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని 75 వీరాపురం, పూలకుంట తదితర గ్రామాల్లో ఉల్లిపంటను హార్టికల్చర్ డీడీ ఉమాదేవి బుధవారం పరిశీలించారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉల్లిపంట కొనుగోలుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు చేపట్టిన నేపథ్యంలో.. డీడీ ఆ పంటను పరిశీలించేందుకు గ్రామాల్లో పర్యటించారు. జిల్లాలో ఉల్లి ఏ స్థాయిలో దిగుబడి ఉంది.. ఏఏ గ్రామాల్లో అధికంగా సాగుచేశారు.. తరతర వాటిని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు, టీడీపీ క్లస్టర్ ఇనచార్జి కాలవ సన్నన్న, 75 వీరాపురం సర్పంచ నాగరాజు, బీటీపీ రాజు, దేవరాజు పాల్గొన్నారు.