మార్కెట్‌యార్డు చైర్‌పర్సన ప్రమాణ స్వీకారం
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:23 AM
మార్కెట్‌యార్డు చైర్‌పర్సనగా భూమా నాగరాగిణి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మొదట ఆమె.. కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాడిపత్రి, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): మార్కెట్‌యార్డు చైర్‌పర్సనగా భూమా నాగరాగిణి సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. మొదట ఆమె.. కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనంపై ర్యాలీగా మార్కెట్‌యార్డుకు చేరుకున్నారు. మొత్తం 20 మంది సభ్యులతో సెక్రటరీ రంగనాథ్ ప్రమాణస్వీకారం చేయించారు. మార్కెట్‌యార్డు చైర్‌పర్సనగా ఎంపికైన భూమా నాగరాగిణి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి, మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి తనను నమ్మి మార్కెట్‌యార్డు చైర్మనగా నియమించినందుకు రుణపడి ఉంటానన్నారు. రైతులు, వ్యాపారులను సమన్వయం చేసుకొని మార్కెట్ యార్డ్‌ను అన్నివిధాలా అభివృద్ధి చేస్తానన్నారు. మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు అన్నివిధాలుగా మార్కెట్‌యార్డును ఉపయోగించుకోవచ్చునని, సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని అన్నారు. అభివృద్ధిలో మహిళ పాత్రే కీలకమని, అందుకే మార్కెట్ యార్డ్‌ను వారి చేతుల్లో పెడుతున్నానని అన్నారు.