ఇక దుర్గంలో పశువుల సంత
ABN , Publish Date - Oct 29 , 2025 | 11:36 PM
స్థానిక మార్కెట్ యార్డులో ఇక ప్రతి శుక్రవారం గొర్రెల సంత, ప్రతి శనివారం పశువుల సంత నిర్వహిస్తామని మార్కెట్ యార్డు చైర్‌పర్సన లక్ష్మీదేవి, వైస్ ఛైర్మన కోనంకి రాజశేఖర్ తెలిపారు.
కళ్యాణదుర్గంరూరల్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక మార్కెట్ యార్డులో ఇక ప్రతి శుక్రవారం గొర్రెల సంత, ప్రతి శనివారం పశువుల సంత నిర్వహిస్తామని మార్కెట్ యార్డు చైర్‌పర్సన లక్ష్మీదేవి, వైస్ ఛైర్మన కోనంకి రాజశేఖర్ తెలిపారు. బుధవారం మార్కెట్ యార్డులో వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని రైతులు, వ్యాపారులు పశువుల సంత కోసం పావగడ, అనంతపురం, ఉరవకొండ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాలతో ఇక పశువులను సంతను స్థానిక మార్కెట్ యార్డులోనే నిర్వహించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు డైరెక్టర్ కుబేర యాదవ్, ఇనచార్జి కార్యదర్శి శ్రీనివాసులు, సూపర్‌వైజర్ కేశవకుమార్ పాల్గొన్నారు.