స్మార్ట్ మీటర్లు వద్దు : సీపీఐ
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:16 AM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రజలపై మరింత ఆర్థిక భారాన్ని మోపేందుకు యత్నిస్తున్నాయని, ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీ జగదీష్ డిమాండ్ చేశారు.
గుత్తి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రజలపై మరింత ఆర్థిక భారాన్ని మోపేందుకు యత్నిస్తున్నాయని, ఆ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీ జగదీష్ డిమాండ్ చేశారు. స్థానిక నిజామీ ఫంక్షన హల్‌లో బుధవారం నిర్వహించిన సీపీఐ మండల స్థాయి మహాసభలో ఆయన మాట్లాడారు. నియోజవర్గంలో చెరువులను హంద్రీ జలాలతో నింపాలన్నారు. ముందుగా స్ధానిక అర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి నిజామీ ఫంక్షన హల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, సహాయ కార్యదర్శి రమేష్, మండల కార్యదర్శి రామదాస్ పాల్గొన్నారు.