ఉపాధి చట్టంలో మార్పులొద్దు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:07 AM
కేంద్ర ప్రభుత్వం కూలీల హక్కులను హరించే విధంగా చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.
ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్ : కేంద్ర ప్రభుత్వం కూలీల హక్కులను హరించే విధంగా చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఆ పథకానికి మహాత్మ గాంధీ పేరునే కొనసాగించాలని కోరారు. ఈ మేరకు సోమవారం పలు ప్రాంతాల్లో నిరసనలు, ధర్నాలు చేపట్టారు. గుంతకల్లులోని గాంధీ సర్కిల్‌లో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీఓ కార్యాలయంలోని గ్రీవెన్సలో ఆర్డీఓ శ్రీనివా్‌సకు సీపీఐఎంఎల్ న్యూడెమోకస్రీ పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. తాడిపత్రిలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపి.. తహసీల్దార్ సోమశేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. కళ్యాణదుర్గంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ ఆర్డీవో వసంత బాబుకు వినతి పత్రం అందజేశారు. అలాగే యాడికి, గుత్తి, పెద్దవడుగూరు, విడపనకల్లు, కణేకల్లులో ఆ నాయకులు నిరసన చేపట్టారు.