నూతన పారిశ్రామిక పాలసీ ప్రయోజనకరం
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:48 PM
ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పారిశ్రామిక పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉందని జిల్లాపరిశ్రమలశాఖ అధికారి నాగరాజు అన్నారు. బుధవారం హిందూపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ర్యాప్ కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాపరిశ్రమలశాఖ అధికారి నాగరాజు
హిందూపురం, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పారిశ్రామిక పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉందని జిల్లాపరిశ్రమలశాఖ అధికారి నాగరాజు అన్నారు. బుధవారం హిందూపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణంలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ర్యాప్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన రమేష్, వాల్మీకి కార్పొరేషన డైరెక్టర్ ఆనంద్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు తీసుకొచ్చిన పాలసీలు యువ పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూరేలా ఉందన్నారు. మేధోసంపత్తి హక్కులు ఎలా రిజిష్టర్ చేసుకోవాలో తెలియజేశారు. వాటి ప్రాముఖ్యత, సమస్యల పరిష్కారం వివరించారు. పరిశ్రమలు రావడంవల్ల ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయన్నారు.