Share News

పాత ఫోనలో కొత్త యాప్‌లు..!

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:51 AM

పాత ఫోన్లలో కొత్త యాప్‌లతో అంగనవాడీలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల ముందు అంగనవాడీలకు యాప్‌లతో పనిలేకుండా చేస్తామని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. గతంలో ఉన్న యాప్‌లకు తోడు బాల సంజీవని 2.0 వర్షనతో పనిభారం మోపారు.

పాత ఫోనలో కొత్త యాప్‌లు..!
సెల్‌ఫోన్లు వాపసు చేసేందుకు చెన్నేకొత్తపల్లి ఐసీడీఎస్‌ కార్యాలయానికి వచ్చిన అంగనవాడీలు (ఫైల్‌)

సక్రమంగా పనిచేయని ఫోన్లు

నెట్‌వర్క్‌ అందక ఇక్కట్లు

గంటల తరబడి యాప్‌లతో అంగనవాడీల కుస్తీ

పని చేయట్లేదంటూ వాపసు

కొత్తవి ఇవ్వాలని డిమాండ్‌

ఽధర్మవరం, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): పాత ఫోన్లలో కొత్త యాప్‌లతో అంగనవాడీలకు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల ముందు అంగనవాడీలకు యాప్‌లతో పనిలేకుండా చేస్తామని చెప్పిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. గతంలో ఉన్న యాప్‌లకు తోడు బాల సంజీవని 2.0 వర్షనతో పనిభారం మోపారు. అంగనవాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు రేషన సరుకులను మరింత పకడ్బందీగా పంపిణీ చేయాలంటూ ప్రభుత్వం యాప్‌లో మార్పులు, చేర్పులు చేసింది. అప్పటినుంచి అంగనవాడీలకు యాప్‌ కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన యాప్‌లు మొబైల్‌ ఫోన్లలో ఇనస్టాల్‌ కాక అవస్థలు పడుతున్నారు. యాప్‌ల నిర్వహణలో సమస్యలను పరిష్కరించకుండా లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో కార్యకర్తలు అందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తాజాగా బాలసంజీవని 2.0 వర్షనతో కొత్తయా్‌పలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిలో కార్యకర్తలు, హెల్పర్లు, ఫొటో క్యాప్చర్‌ చేసి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండడంతో పౌష్టికాహార పంపిణీలో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో పనిని మూడు యాప్‌లలో అప్‌లోడ్‌ చేయాల్సి వస్తుండడం, యాప్‌లో సాంకేతిక లోపం కారణంగా పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. అంగనవాడీ కార్యకర్తల వేతనానికి ఫేస్‌యా్‌పతో ముడిపెట్టారు. ఫేస్‌యాప్‌ వేసిన రోజులకు మాత్రమే వేతనం వస్తుంది. సాంకేతిక సమస్య తలెత్తి ఆ రోజు యాప్‌లో నమోదు కాకపోతే కట్‌ అవుతుంది. ప్రభుత్వం కోరిన సమాచారాన్ని యాప్‌ల ద్వారా ఇవ్వడం, రికార్డులు రాయడం, టేక్‌హోం రేషన పంపిణీ, ప్రతినెలా 1 నుంచి 5వతేదీ వరకు పిల్లల బరువు పరిశీలించడంవంటి పనులు చేయాల్సి ఉంటుంది. రూ.11,500 గౌరవ వేతనం ఇస్తూ నెలంతా తమతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారని మండిపడుతున్నారు. కనీస వేతనం అమలు చేయాలని కోరుతున్నారు.

సెల్‌ఫోన్లు వాపసు

సీడీపీఓ కార్యాలయాల్లో పాత ఫోన్లను అంగనవాడీలు తిరిగి ఇచ్చేశారు. ఫోన్లు సరిగా పని చేయని, నెట్‌వర్క్‌ సరిగా లేని సిమ్‌లు ఇచ్చారని వారు వాపోయారు. మంచి ఫోన్లు ఇవ్వాలనీ, అప్పటి వరకు ఆనలైన వర్క్‌ చేయమని అంగనవాడీలు పేర్కొన్నారు. ఆ మేరకు ఐసీడీఎస్‌ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశారు.

వారంలో కొత్త ఫోన్లు అందజేస్తాం

ఫోన్లు సక్రమంగా పనిచేయట్లేదని అంగనవాడీలు వాపసు చేస్తున్న విషయం వాస్తవమే. విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాం. కొత్తఫోన్ల కొనుగోలు కోసం ప్రభుత్వం.. ఆర్థిక శాఖ ఆమోదానికి పంపింది. త్వరలో అప్రూవల్‌ అవుతుందని మెసెజ్‌లు కూడా వచ్చాయి. వచ్చే వారంలో కొత్త ఫోన్లను ప్రభుత్వం అందజేస్తుంది.

-ప్రమీల, పీడీ, ఐసీడీఎ్‌స

Updated Date - Aug 06 , 2025 | 01:51 AM