Share News

Nettikanti Swamy నెట్టికంటికి రూ.2.25 కోట్లు

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:56 AM

కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారి గర్భాలయం, విమాన గోపురం, ముఖమండపం రాతితో నిర్మించేందుకు దాతలు ముందుకొచ్చారు.

Nettikanti Swamy నెట్టికంటికి రూ.2.25 కోట్లు
దాతకు స్వామివారి చిత్రపటాన్ని అందజేస్తున్న అధికారులు, అర్చకులు

రాతి ముఖమండపం నిర్మాణానికి ముందుకొచ్చిన దాతలు

గుంతకల్లు టౌన, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): కసాపురం శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారి గర్భాలయం, విమాన గోపురం, ముఖమండపం రాతితో నిర్మించేందుకు దాతలు ముందుకొచ్చారు. కర్ణాటకలోని రా యచూరు పట్టణానికి చెందిన నవోదయ విద్యాసంస్థల అధినేత, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణఖేడ్‌ మాజీ ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డి కసాపురం ఆ లయంలో గర్భాలయం, విమాన గోపురం, ముఖమండపాన్ని రాతితో నిర్మించేందుకు రూ.2.25 కోట్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు అంగీకార పత్రాన్ని ఆ లయ ఈఓ విజయరాజుకు శుక్రవారం రాయచూరులో అందజేశారు. అనంత రం ఆయనకు వేదపండితులు, అర్చకులు.. స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాల ను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు రాఘవాచార్యులు, వేదపండితులు సాయికుమార్‌శర్మ, ఏఈఓ వెంకటేశ్వరుడు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 12:56 AM