ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:10 AM
యాడికి గ్రామపంచాయతీ కార్యాల యంలో గురువారం నిర్వహిం చిన పాలకవర్గ సమావేశానికి 20 మంది వార్డు సభ్యులకు గాను కేవలం ముగ్గురు సభ్యులు దేవి, పార్వతి, సావిత్రి మాత్రమే హాజరయ్యారు.
యాడికి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): యాడికి గ్రామపంచాయతీ కార్యాల యంలో గురువారం నిర్వహిం చిన పాలకవర్గ సమావేశానికి 20 మంది వార్డు సభ్యులకు గాను కేవలం ముగ్గురు సభ్యులు దేవి, పార్వతి, సావిత్రి మాత్రమే హాజరయ్యారు. గ్రామ సర్పంచు అనురాధ, ఉప సర్పంచు చంద్రమోహన సహా మిగిలిన వార్డు సభ్యులూ గైర్హాజర్ అయ్యారు. ప్రజా సమస్యలపై ప్రజా ప్రతినిధులైన వైసీపీ నాయకులు నిర్లక్ష్యం చూపడం పలు విమర్శలకు తావిస్తోంది.