22 నుంచి నవరాత్రి ఉత్సవాలు
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:00 AM
స్థానిక యల్లనూరురోడ్డులోని వాటర్‌ట్యాంక్ వద్ద ఉన్న శ్రీ విజయచౌడేశ్వరిదేవి ఆలయంలో ఈనెల 22నుంచి అక్టోబరు 2వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఉత్సవ సమితి కన్వీనర్ పోతుల గంగాధర్‌యాదవ్ తెలిపారు.
తాడిపత్రి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక యల్లనూరురోడ్డులోని వాటర్‌ట్యాంక్ వద్ద ఉన్న శ్రీ విజయచౌడేశ్వరిదేవి ఆలయంలో ఈనెల 22నుంచి అక్టోబరు 2వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఉత్సవ సమితి కన్వీనర్ పోతుల గంగాధర్‌యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ దుర్గామాత మట్టి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పందిరికర్ర పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు శివారెడ్డి, నారాయణస్వామి, వేణుగోపాల్, హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.