నవరూప ఆంజనేయస్వామి గ్రామోత్సవం
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:56 AM
గుత్తి ఆర్‌ఎ్‌సలోని నవరూప ఆంజనేయస్వామి గ్రామోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు
గుత్తి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): గుత్తి ఆర్‌ఎ్‌సలోని నవరూప ఆంజనేయస్వామి గ్రామోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని సీతారాములు, ఆంజనేయస్వామికి గణపతి స్వాములకు పంచామృతాభిషేకం, అర్చన, హారతి నిర్వహించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తిని ఉంచి హనుమాన, శివదీక్ష, భవానీ, అయ్యప్ప స్వామి దీక్షాపరులు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకుడు గంగాధర్ స్వామి, బద్రీస్వామి పాల్గొన్నారు.