Share News

ICDS: అంగనవాడీల సమస్యలపై ఉద్యమాలు తప్పవు

ABN , Publish Date - Aug 08 , 2025 | 12:34 AM

అంగనవాడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు తప్పవని సీఐటీయూ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు ఓబులు పేర్కొన్నారు. ఆయన గురువారం మండలంలోని మహమ్మదాబాద్‌ క్రాస్‌లో అంగనవాడీ కార్యకర్తల సమావేశంలో మాట్లా డారు. కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ, దేశవ్యాప్తంగా గతనెల 9న సర్వత్రిక సమ్మె చేపట్టామన్నారు.

ICDS: అంగనవాడీల సమస్యలపై ఉద్యమాలు తప్పవు

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు

ఓబుళదేవరచెరువు, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి) : అంగనవాడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు తప్పవని సీఐటీయూ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు ఓబులు పేర్కొన్నారు. ఆయన గురువారం మండలంలోని మహమ్మదాబాద్‌ క్రాస్‌లో అంగనవాడీ కార్యకర్తల సమావేశంలో మాట్లా డారు. కార్మిక చట్టాల సవరణను వ్యతిరేకిస్తూ, దేశవ్యాప్తంగా గతనెల 9న సర్వత్రిక సమ్మె చేపట్టామన్నారు. అనేక నిరసనలు చేపట్టామన్నారు. అంగనవాడీ కార్మికులకు గ్రాట్యుటీ, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, రిటైర్మెంట్‌ బెన్ఫి ట్స్‌తో పాటు ఉద్యోగభద్రత కల్పించాలన్నారు. మినీ వర్కర్లకు మెయిన వర్కరులుగా ఉద్యోగోన్నతి కల్పించాలన్నారు. సమాన పనికి సమాన వేత నం ఇవ్వడంతోపాటు అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపా లన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి దశలవారీ ఉద్యమాలు చేపడతామన్నారు. ఆయనతో పాటు సీఐటీయూ జిల్లా కార్యదర్శి లక్ష్మీ నారాయణ, అంగనవాడీ కార్మికుల యూనియన జిల్లా కార్యదర్శి శ్రీదేవి, సీఐటీయూ మండల కార్యదర్శి కుళ్లాయప్ప, నాయకులు ఆశీర్వాద మ్మ, క్రిష్టమ్మ, స్వర్ణ, షంమీమ్‌, సరళ, సునీతబాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 08 , 2025 | 12:34 AM