Share News

కసాపురంలో మరిన్ని వసతి గదులు

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:18 AM

కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం 91 వసతి గదులను దాతల సహకారంతో నిర్మిస్తున్నట్లు టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి తెలిపారు.

కసాపురంలో మరిన్ని వసతి గదులు
స్థలాన్ని పరిశీలిస్తున్న నాయకులు, అధికారులు, దాతలు

గుంతకల్లు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం 91 వసతి గదులను దాతల సహకారంతో నిర్మిస్తున్నట్లు టీడీపీ నాయకుడు గుమ్మనూరు నారాయణ స్వామి తెలిపారు. అప్పుడే 23 గదులకు 23 మంది దాతలు ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. మంగళవారం దేవస్థాన ఆవరణలో ఆ దాతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వితరణ మొత్తాన్ని మూడు విడతలుగా చెల్లించడానికి దాతలు అంగీకరించినట్లు తెలిపారు. అనంతరం ఈఓ విజయరాజు, ధర్మకర్త సుగుణమ్మ, దాతలతో కలసి వెళ్లి వసతి గదులు నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. వారి వెంట తహసీల్దారు రమాదేవి, టీడీపీ నాయకులు తలారి మస్తానప్ప, జీ కొట్టాల సురేశ, యుగంధర్‌ ఉన్నారు.

Updated Date - Nov 12 , 2025 | 12:18 AM