Share News

రైలు ప్రమాదంపై మాక్‌ డ్రిల్‌

ABN , Publish Date - Nov 07 , 2025 | 11:46 PM

రైలు ప్రమాదాలు జరిగిన సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై రైల్వే శాఖ స్థానిక తిమ్మనచర్ల రైల్వే స్టేషనలో శుక్రవారం మాక్‌ డ్రిల్‌ను నిర్వహించింది.

రైలు ప్రమాదంపై మాక్‌ డ్రిల్‌
మాక్‌ డ్రిల్‌లో పాల్గొన్న సిబ్బంది

గుంతకల్లు, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): రైలు ప్రమాదాలు జరిగిన సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై రైల్వే శాఖ స్థానిక తిమ్మనచర్ల రైల్వే స్టేషనలో శుక్రవారం మాక్‌ డ్రిల్‌ను నిర్వహించింది. ఉదయం తొమ్మిదిన్నరకు రైల్వే స్టేషనలో ప్రమాద సైరన మోగగా యాక్సిడెంట్‌ రిలీఫ్‌ ట్రెయిన (ఏఆర్టీ), యాక్సిడెంట్‌ రిలీఫ్‌ మెడికల్‌ వ్యాన (ఏఆర్‌ఎంవీ)లను రైల్వే సిబ్బంది తిమ్మనచర్ల రైల్వే స్టేషనకు తీసుకువచ్చారు. అక్కడ రైలు ప్రమాదం జరిగినట్టు, ఒక దానిపై ఒకటి ఎక్కిన స్థితిలో బోగీలు ఉండగా రెస్క్యూ ఆపరేషన చేపట్టారు. గ్యాస్‌ కట్టర్‌తో కిటికీ ఊచలను తొలగించి అగ్ని మాపక యంత్రాలతో మంటలను ఆర్పి అందులో ఉన్న ప్రయాణికుల పాత్రను పోషిస్తున్న సిబ్బందిని స్ర్టెచర్ల ద్వారా వైద్య శిబిరాలకు చేర్చారు. మొత్తం డ్రిల్‌ గంటన్నరలో పూర్తయిందని అధికారులు తెలిపారు.

Updated Date - Nov 07 , 2025 | 11:46 PM