Share News

Mla Sindura Reddy అంగనవాడీ పోస్టులు భర్తీ చేయండి

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:47 PM

నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న అంగనవాడీ పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి.. ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే.. నియోజకవర్గ సమస్యలపై గళం వినిపించారు.

Mla Sindura Reddy అంగనవాడీ పోస్టులు భర్తీ చేయండి
పల్లె సింధూరారెడ్డి

అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి

పుట్టపర్తి రూరల్‌, మార్చి 11(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న అంగనవాడీ పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి.. ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే.. నియోజకవర్గ సమస్యలపై గళం వినిపించారు. నియోజకవర్గంలో 116 అంగనవాడీ సూపర్‌ వైజర్‌ పోస్టులు ఉండగా.. 55 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. మిగతా పోస్టులను భర్తీ చేయాలని కోరారు. నియోజకవర్గంలో 451 అంగనవాడీ కేంద్రాలున్నాయనీ, వాటిలో 250 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. వాటికి సొంత భవనాలు నిర్మించాలని కోరారు. వైసీపీ హయాంలో ఆగిపోయిన వాటికి నిధులు మంజూరుచేసి, నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. ఎమ్మెల్యే ప్రశ్నకు సంబంధిత మంత్రి గుమ్మడి సంద్యారాణి బదులిస్తూ.. పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అంగనవాడీ కేంద్రాల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అనంతరం నియోజకవర్గంలోని 193 చెరువులను హంద్రీనీవా నీటితో నింపే ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ తయారు చేశారా, ఎప్పటిలోగా పూర్తి చేస్తారని సంబంధిత మంత్రి దృష్టికి ఎమ్మెల్యే సింధూరా రెడ్డి తీసుకెళ్లారు.

Updated Date - Mar 11 , 2025 | 11:47 PM